తెలంగాణలో 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత 28 మంది ఐపీఎస్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేస్తూ సీఎస్ శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా యూనిట్ల అధికారులతో పాటు హైదరాబాద్ సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేశారు. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.
భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
జగిత్యాల ఎస్పీగా అశోక్‌కుమార్
సూర్యాపేట ఎస్పీగా సన్‌ప్రీత్ సింగ్
హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే
జోగులాంబ గద్వాల ఎస్పీగా టి. శ్రీనివాస్‌రావు
అవినీతి నిరోధకశాఖ జాయింట్ డైరెక్టర్‌గా రుతురాజ్
కుమ్రంభీం ఆసిఫాబాద్ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు
బాలానగర్ డీసీపీగా కె.సురేశ్‌కుమార్
మహబూబ్‌నగర్ ఎస్పీగా ధరావత్ జానకి
సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్ధన్
సీఐడీ ఎస్పీగా విశ్వజిత్ కంపాటి
శంషాబాద్ డీసీపీగా బి.రాజేశ్
మేడ్చల్ జోన్ డీసీపీగా ఎన్.కోటిరెడ్డి
వికారాబాద్ ఎస్పీగా కె.నారాయణరెడ్డి
నల్గొండ ఎస్పీగా శరద్ చంద్రపవార్
రైల్వేస్ ఎస్పీగా చందనాదీప్తి
వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా షేక్ సలీమా
యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా సాయి చైతన్య
హైదరాబాద్ నార్త్‌జోన్ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ్
డిచ్‌పల్లి ఏడో బెటాలియన్ కమాండెంట్‌గా రోహిణి ప్రియదర్శిని
మంచిర్యాల డీసీపీగా ఎ.భాస్కర్
జనగామ వెస్ట్‌జోన్ డీసీపీగా జి.రాజమహేంద్ర నాయక్
టీజీఎస్పీ(రెండో బెటాలియన్ కమాండెంట్ గా నితికా పంత్