TG : బంపర్ మెజారిటీ కొట్టిన పవర్ ఫుల్ ఎంపీలు వీరే!

Update: 2024-06-05 07:40 GMT

నల్గొండ కాంగ్రెస్ అభ్యర్ధి రఘువీర్రెడ్డి తెలుగు రాష్ట్రాల చరిత్ర లోనే అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిపై 5,59,905 ఓట్ల మెజార్టీని ఆయన సాధించారు. 2011లో కడప లోక్ సభ స్థానం నుంచి వైఎస్ జగన్ 5.43 లక్షల మెజార్టీతో గెలుపొందిన రికార్డు ఉంది. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురాంరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధి నామా నాగేశ్వర్రావుపై 4,67,847 ఓట్ల మెజార్టీతో గెలుపొ దారు.

మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కాంగ్రెస్ అభ్యర్ధి పట్నం సునీతా మహేందర్రెడ్డిపై 3,91,475 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మహబూ బాబాద్లో కాంగ్రెస్ అభ్యర్ధి బలరాంనాయక్ ఆర్ఎ.ఎస్ అభ్యర్ధి మాలోత్ కవితపై 3,49,165 ఓట్ల మెజారిటీ సాధించారు. హైదరాబాద్లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ 3,03,837 ఆధిపత్యాన్ని మాదవీలతపై సాధించారు. కరీంనగర్ బీజేపీ లోక్సభ అభ్యర్ధి బండి సంజయ్ తన సమీప ప్రత్యర్ధి, వెల్చాల రాజేశ్వర్రావుపై 2,25,209 ఓట్ల మెజార్టీతో గెలుపు సాధించారు.

వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ పై 2,20,399 ఓట్లతో జయకేతనం ఎగుర వేశారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ పై 2లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి 1,72,897 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ పై 1,31,364 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నిజామాబాద్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి ఆర్వింద్ కాంగ్రెస్ నేత జీవన్రెడ్డిపై 1,09,241 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Tags:    

Similar News