Allu Arjun : అల్లు అర్జున్ కు పోలీసులు చేసిన అసలు రిక్వెస్ట్ ఇదే

Update: 2025-01-06 10:00 GMT

అల్లు అర్జున్ కు అనుమతి లేకుండా ఎక్కడికైనా వెళ్తే అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్న సూచన అందింది. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అర్జున్ పరామర్శించాలనుకుంటే ఆస్పత్రివర్గాలతో సమన్వయం చేసుకోవాలని రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ కు సూచించారు. బన్నీ రాకకు సంబంధించి పోలీసుల నుంచి అనుమతి తీసుకుంటే ఆసుపత్రి ఆవరణ, పరిసర ప్రాంతాలలో ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో పరామర్శకు ఎప్పుడు వస్తున్నారో రహస్యంగా ఉంచాలని.. దీంతో అల్లు అర్జున్ వస్తున్నాడని ఆస్పత్రి దగ్గరకు పెద్ద సంఖ్యలో అభిమానులు రాకుండా చూసేందుకు వీలవుతుందని పోలీసులు ఇచ్చిన నోటీసులలో తెలిపారు. అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి వస్తే ఊహించని ఘటనలు జరగకుండా చేసేందుకు బన్నీ సహకారం కావాలని నోటీసులలో పేర్కొన్నారు. మీనుంచి సరైన సహకారం లేకపోవడం వల్ల పబ్లికికి ఇబ్బందులు తలెత్తి, ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే దానికి మీదే బాధ్యత వహించాలంటూ రాంగోపాల్పేట ఇన్స్పెక్టర్ నోటీసులలో ముందస్తు హెచ్చరికలు చేశారు.

Tags:    

Similar News