Jagityal: జగిత్యాలలో రోడ్డు ప్రమాదం.. ఆటో, బైక్ ఢీ.. ముగ్గురు మృతి..
Jagityal: జగిత్యాల జిల్లా రాజారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.;
Jagityal: జగిత్యాల జిల్లా రాజారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆటో.. కరీంనగర్ నుంచి వస్తున్న బైక్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మృతిచెందినవారంతా.. నూకపల్లి అర్బన్ కాలనీలో డబూల్ బెడ్ రూం ఇళ్ల కోసం పనిచేస్తున్న కూలీలుగా గుర్తించారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.