జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మహాదేవపూర్ మండలం అంబటిపల్లిలో ప్రైవేటు స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అంబటిపల్లికి చెందిన మల్లేశ్, భాగ్య దంపతుల కొడుకు అనివిత్‌ను స్కూల్ బస్సు ఎక్కించడానికి కూతురుతో కలిసి తల్లి వచ్చింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కూతురు శ్రీహర్షిణి బస్సు కింద అక్కడిక్కడే మరణించింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.