దుబ్బాక.. ఆరోరౌండ్‌లో టీఆర్ఎస్
ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెడ్డికి;
దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆరో రౌండ్‌లో వెనుకంజ వేసింది. ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెడ్డికి 4062 ఓట్లు పోలవగా, బీజేపీకి 3709 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 530 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఆరో రౌండ్ ముగిసే నాటికి బీజీపీకి 2,667 ఓట్ల మెజారిటీ వచ్చింది.