Suryapet: సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం.. రెండు బైకులు ఎదురెదురుగా ఢీ.. నలుగురు మృతి..
Suryapet: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు-ఎస్ మండలం నశింపేట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.;
Suryapet: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు-ఎస్ మండలం నశింపేట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అర్ధరాత్రి టైంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు తెట్టేకుంట తండాకు చెందిన బానోతు అరవింద్, బొట్య తండాకు చెందిన భూక్యా నవీన్, లక్ష్మీనాయక్ తండాకు చెందిన దరావత్ ఆనంద్ ఉన్నారు. ఏపూరు తండాకు చెందిన వినేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వినేష్‌ను మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.