Siddipet Car Accident : కారు ఢీకొని ఇద్దరు ఉపాధి కూలీలు మృతి

Update: 2025-05-13 05:45 GMT

ఉపాధి హామీ పనికి వెళ్తున్న ఇద్దరు మహిళలను అతివేగంతో వచ్చిన కారు ఢీకొనడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం పరిధి లోని చోటుచేసుకుంది. పోతారెడ్డిపేట గ్రామానికి చెందిన దేవవ్వ, చంద్రవ్వలు రోజు లాగే ఉపాధి పనులకు బయలుదేరారు. ఈ క్రమంలోనే అతివేగంగా దూసుకెళ్తున్న కారు వారిని ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందారు. తోటి మహిళా కూలీలు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును, కారు డ్రైవర్ ను అదుపు లోకి తీసుకున్నారు. మృతి చెందిన వారికి న్యాయం చేయాలంటూ గ్రామస్థులు మొయిన్ రోడ్డుపై ఆందోళన దిగారు. దీంతో మెదక్ - సిద్దిపేట నేషనల్ హైవేపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

Tags:    

Similar News