రెండు బైక్ లు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మరిపెడ పట్టణ శివారులోని నేషనలైవేపై రోడ్డుపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. భావోజీగూడెం శివారు వెంకురాం తండా బుచే తండాలకు చెందిన భూక్య సంతోష్, గుగులోత్ కార్తిక్ బైక్, మరో బైకు ఢీకొట్టింది. ఈ ఘటనలో సంతోష్, కార్తిక్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో బైక్పై ఉన్న సుధీర్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గా యపడ్డవారిని హాస్పిటల్ కు తరలించగా.. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.