కాంగ్రెస్ కురవృద్దుడు వీ హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్‌లో తనకు ఎంపీ టికెట్ వస్తే గెలిచేవాడని అంటూ కామెంట్స్ చేశారు. ఎనిమిదేళ్లలో తనకు ఒక్క పదవి లేదన్న వీహెచ్.. రాజ్యసభకు తనకు అవకాశం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. టీ-20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా టీమ్‌కు వీహెచ్ శుభాకాంక్షలు తెలిపారు. క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు సీఎం రేవంత్ ప్లాట్, ఉద్యోగం ఇస్తాననడం హర్షణీయమని చెప్పారు వీహెచ్. గతంలో అతని ప్రతిభను చూసి సీఎఫ్ఐ ఛైర్మెన్‌గా తాను సన్మానించానని తెలిపారు. ఏపీలో 12 క్రికెట్ స్టేడియాలు ఉన్నాయన్న వీహెచ్ .. తెలంగాణలో స్టేడియానికి ప్రతి జిల్లాలో 12 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని వెల్లడించారు.