TG : మండలి చైర్మన్ గా వీహెచ్? కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన

Update: 2025-02-12 07:15 GMT

తెలంగాణ శాసనమండలిలో భారీ మార్పులకు కాంగ్రెస్ అధినాయకత్వం సూచనలు చేసినట్టు సమాచారం. శాసనమండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి స్థానంలో పార్టీ సీనియర్ నేతను ఎంపిక చేయాలన్న ఆదేశాలు పార్టీ హైకమాండ్ నుంచి జారీ అయ్యాయనే టాక్ వినిపిస్తోంది. పార్టీ సీనియర్ నేత, బీసీ నాయకుడు వి.హనుమంతరావుకు మండలి చైర్మన్ పదవి ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. వీహెచ్ కు ముందు బీసీ కమిషన్ చైర్మన్ పోస్ట్ ఇవ్వాలనుకున్నారు. రేవంత్ రెడ్డి పిలిచి మాట్లాడినప్పటికీ వీహెచ్ తిరస్కరించడంతో.. నిరంజన్ కు ఆ పోస్ట్ ఇచ్చారు. ఐతే... శాసన మండలి పదవిలో వీహెచ్ ను కూర్చోబెట్టాలని నిర్ణయించారు. త్వరలోనే ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి వీహెచ్ కు కేటాయించే చాన్సుంది. 

Tags:    

Similar News