Vande Bharat Delay : 4 గంటలు ఆలస్యంగా విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్

Update: 2024-06-22 07:41 GMT

విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ( Vande Bharat ) 4 గంటలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 5.45 గంటలకు ట్రైన్ విశాఖ నుంచి బయల్దేరాలి. కానీ సి-9 కోచ్‌లో సాంకేతిక లోపం కారణంగా ఉ.10 గంటలకు ట్రైన్ బయల్దేరనుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. నాలుగు గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రతిరోజు ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. తిరిగి సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11:30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈరైలు మార్గమధ్యలో వరంగల్​, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వేస్టేషన్లలో ఆగుతుంది.

Tags:    

Similar News