ఉత్కంఠగా మారిన ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్‌ నవ్య వివాదం

జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు ఈ వివాదాన్ని సుమోటోగా స్వీకరించాయి.;

Update: 2023-06-24 07:45 GMT

ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్‌ నవ్య వివాదంలో ఉత్కంఠ నెలకొంది. జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు ఈ వివాదాన్ని సుమోటోగా స్వీకరించాయి. ఈ అంశంపై విచారణ చేపట్టి నివేదిక అందించాల్సిందిగా పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేశాయి. ఎమ్మెల్యే రాజయ్య తనను వేధించినట్లు ఈ నెల 21న నవ్య ఫిర్యాదు చేసింది. దీంతో ఆధారాలు ఇవ్వాలంటూ నవ్యకు కాజీపేట ఏసీపీ శ్రీనివాస్‌ నోటీసులు జారీ చేశారు. రాజయ్యపై ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలు మూడ్రోజుల్లోగా ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. మరి నవ్య ఆధారాలు సమర్పిస్తారా? ఒకవేళ సమర్పిస్తే పోలీసులు రాజయ్యపై కేసు నమోదు చేస్తారా? అనే అంశం ఉత్కంఠను రేపుతోంది.

Tags:    

Similar News