స్థానిక ఎన్నికలు ఎప్పుడు.. కాంగ్రెస్ ప్లాన్ ఏంటి..?

Update: 2025-11-04 16:13 GMT

కాంగ్రెస్ ప్రభుత్వంపై స్థానిక ఎన్నికల విషయంలో ఒత్తిడి పెరుగుతోంది. ఎప్పుడు పెడుతారంటూ సీఈసీ అడుగుతూనే ఉంది. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చాలా బిజీగా ఉంది. ఈ ఎన్నికల తర్వాత కచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఒత్తిడి కిందిస్థాయి నాయకుల నుంచి కూడా వస్తోంది. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ప్రస్తుతం కోర్టులో విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు రావొద్దని భావిస్తోంది. అటు బీసీ సంఘాలు కూడా తమకు రిజర్వేషన్లు పెంచి తీరాల్సిందే అంటూ పట్టుబడుతున్నాయి. కానీ అది లీగల్ గా సాధ్యం అయ్యే పరిస్థితులు కనిపించట్లేదు.

కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పార్టీ పరంగా అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఇవ్వడం కుదిరే పరిస్థితులు లేవు. 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత రావట్లేదు కాబట్టి బీసీ సంఘాలతో మరోసారి చర్చలు జరపనుంది ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని భావిస్తోంది. అలా చేస్తే తమకు బీసీల ఓట్ల మద్దతు ఉంటుందని కాంగ్రెస్ ఆలోచన. కానీ దానిపై బీసీ సంఘాలు ఒప్పుకుంటాయా లేదా అన్నది ఇంకా అనుమానమే. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు లేకపోవడంతో కేంద్రం నుంచి కూడా ఎలాంటి నిధులు రావట్లేదు. ఎన్నికలు పెడితేనే ఈ నిధులు వస్తాయి.

కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందే. లేకపోతే ప్రభుత్వం మీదనే వ్యతిరేతక వస్తుందనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందనేది కూడా ఇక్కడ చాలా కీలకం. ఆ తీర్పును బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు టైమ్ దగ్గర పడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికలు అయిపోయేలోపే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సిందే. లేదంటే మాత్రం ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరగడం ఖాయం అంటున్నారు. మరి కాంగ్రెస్ ఏం చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News