జనగామ పట్టణానికి చెందిన ఓ మహిళ వడదెబ్బతో మృతి చెందింది. స్థానికులు, కుటుంబ సభ్యుల ప్రకారం.. పట్టణంలోని సంజయ్‌నగర్‌కు చెందిన బొమ్మగాని నిర్మల (65) స్థానిక హోటల్‌లో రోజువారీ కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఎండలో నడుచుకుంటూ హోటల్‌కు వెళ్లి వచ్చింది. సాయంత్రం డీహైడ్రేషన్‌కు గురై ఇంట్లో పడిపోయింది.
దీంతో కుటుంబ సభ్యులు ఇంటి వద్ద ప్రాథమిక చికిత్స చేయించారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత పరిస్థితి విషమించడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. నిర్మలకు కుమారుడు శ్రీకాంత్(జర్నలిస్ట్), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీపీఎం భువనగిరి పార్లమెంట్‌అభ్యర్థి ఎండీ జహంగీర్, కాంగ్రెస్ లీడర్లు చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, మేడ శ్రీనివాస్, చెంచారపు బుచ్చిరెడ్డి, కౌన్సిలర్లు రాంచందర్, జక్కుల అనిత, జర్నలిస్టులు తదితరులు పరామర్శించారు.