Sword Reels : కత్తులతో రీల్స్.. యువకుడి అరెస్ట్

Update: 2024-07-18 06:20 GMT

తల్వార్, కత్తులతో విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు. సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్య నగర్ కు చెందిన తోటిచర్ల సాయి వర్ధన్ అనే యువకుడు గత కొద్ది నెలల క్రిందట తల్వార్, పెద్ద కత్తితో విన్యాసాలు చేస్తూ వాటిని పట్టుకొని వివిధ ఫోటోలు వీడియోలు తీసుకున్నాడు. వాటిని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో అప్లోడ్ చేశాడు.

వీడియోలు వైరల్ కావడంతో సాయి వర్ధన్ నుండి పెద్ద కత్తి, బైక్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సాయి వర్ధన్ పై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News