ఆర్ధిక సహాయం చేయండి ప్లీజ్.. నటుడు పొన్నంబళం
ఆ ప్రమాదం నుండి బయటపడాలంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించినట్టుగా వెల్లడించాడు.;
తెలుగు తమిళ్ భాషలతో పాటుగా పలు భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు నటుడు పొన్నంబళం.. అయితే గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.... ఆ ప్రమాదం నుండి బయటపడాలంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించినట్టుగా వెల్లడించాడు. దానికి గాను తన సహోదరి కొడుకు కిడ్నీ దానం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్టుగా తెలిపాడు. అయితే ప్రస్తుతం తనకి ఎలాంటి ఆదాయం లేకపోవడంతో తన కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగా లేక కూమిలిపోతోందన్నారు. ఈ సందర్భంగా సినీరంగంలోని ప్రముఖులను ఆర్ధిక సాయం చేయాల్సిందిగా వేడుకున్నాడు. కాగా ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్, రాధిక శరత్ కుమార్, ధాను ధనుష్, కె ఎస్ రవికుమార్, రాఘవ లారెన్స్ తదితరులు సహాయం చేశారు.