Yashika Anand: కోలుకుంటున్న నోటా హీరోయిన్... గత మూడు నెలలుగా ఆసుపత్రిలోనే..!
Yashika Anand: ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సినీ హీరోయిన్ యాషికా ఆనంద్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.;
Yashika Anand: ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సినీ హీరోయిన్ యాషికా ఆనంద్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆమె గత మూడు నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆమెకి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అక్కడ ఆమె ఒక్కో అడుగు వేస్తూ నడిచే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తగిలిన గాయాలను, పడుతోన్న బాధ గురించి వివరిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దీనితో ఆమె త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. తమిళనాడులో గత నెల జులై 24న జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో నటి యాషికా ఆనంద్‌కి తీవ్ర గాయాలయ్యాయి. అదే ప్రమాదంలో ఆమె స్నేహితురాలు పావని మృతి చెందింది. ఇదే కేసు పైన పోలీసులు ఆమెను త్వరలోనే విచారించనున్నారు. కాగా విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన నోటా సినిమాలో హీరోయిన్‌గా నటించింది యాషికా.