ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నట్లు బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ వెల్లడించారు. ప్రియుడు క్రిలి ఆక్సన్‌ఫాన్స్‌తో విడిపోయినట్లు చెప్పారు. ‘ఈ రోజుల్లో మనకు సెట్ అవుతాడని అనిపించే వ్యక్తి దొరకడం కష్టమైపోతోంది. అతడితో బ్రేకప్ గురించి మాట్లాడాలనుకోవడం లేదు. నాకు పెళ్లిపై ఆసక్తి లేదు. అలాగని వ్యతిరేకం కాదు. అది భవిష్యత్తులో నాకు కనెక్ట్ అయ్యే వ్యక్తిపై డిపెండ్ అయ్యి ఉంటుంది’ అని ఆమె చెప్పుకొచ్చారు.
కాగా మల్లికా షెరావత్.. క్వాశిష్, మర్డర్, ప్యార్‌కే సైడ్ ఎఫెక్ట్స్, డర్టీ పాలిటిక్స్, దశావతారం వంటి పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. ఎక్కువగా ఐటం సాంగ్స్‌తోనే ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవల విక్కీ విద్యాకా వో వాలా వీడియో సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. మల్లికా షెరావత్ ఫ్రెంచ్ పౌరుడు సిరిల్ ఆక్సెన్‌ఫాన్స్‌తో చాలా కాలం రిలేషన్ లో ఉంది. తన కెరీర్ ఊపు తగ్గగానే ఆమె సిరిల్‌తో కలిసి పారిస్‌కు మారింది. ఆక్సెన్‌ఫాన్స్ ఒక వ్యాపారవేత్త. అతను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిదారుగా ఉన్నాడు.