అన్ స్టాపబుల్ షోలో మరోసారి సీఎం చంద్రబాబు సందడి చేయబోతున్నారు. హీరో బాలకృష్ణ వ్యాఖ్యతగా ఇప్పటికే మూడు సీజన్లు పూర్తయ్యాయి. అక్టోబర్ 24 నుంచి ప్రారంభమయ్యే నాలుగో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్‌గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఇందుకు సంబంధించి షూటింగ్ కార్యక్రమం పూర్తయ్యింది. ఇందులో బాలయ్యతో పాటు చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబును బాలకృష్ట సాదరంగా ఆహ్వానించారు. ఇందుకు సంబంధించి వీడియో ట్రెండింగ్ లో ఉంది.