Akkineni Nagarjuna : సూపర్ నాగ్.. మీ డెడికేషన్‌కి హ్యాట్సాఫ్..!
Akkineni Nagarjuna : నిన్నటివరకు టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్ లిస్టులో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు.. కానీ విడాకులతో ఈ బ్రాండ్‌కి ఈ జంట దూరమైపాయింది.;
Akkineni Nagarjuna : నిన్నటివరకు టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్ లిస్టులో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు.. కానీ విడాకులతో ఈ బ్రాండ్‌కి ఈ జంట దూరమైపాయింది. గత కొద్దిరోజులుగా వస్తున్న పుకార్లు నిజం కాకూడదని అభిమానులు ఎంతో కోరుకున్నారు. కానీ అభిమానుల హృదయాలను ముక్కలు చేస్తూ ఇద్దరం విడిపోతున్నాం అంటూ ప్రకటించారు చైసామ్.. అయితే మళ్ళీ వీరిద్దరూ కలవాలని, వీరిని భార్యాభర్తలగా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
అభిమానుల పరిస్థితి ఇలా ఉంటే.. చైతూ తండ్రి నాగార్జున పరిస్థితి ఇంకెలా ఉండాలి. కొడుకు, కోడలు విడిపోతున్నారంటే ఈ బాధ ఎంతలా ఉంటుంది.. మనుసులో ఈ విషయం ఎంత కలవరపెడుతున్నా వీకెండ్‌లో బిగ్‌బాస్ స్టేజి పైకి వచ్చి పెదాలపై చిరునవ్వును మాత్రం చెరగనీయలేదు. ఎప్పటిలాగే హౌజ్ లోని కంటెస్టెంట్లతో గేమ్స్ అడిపిస్తూ, ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు నాగ్..
గుండెల్లోని బాధను చిరునవ్వుతోనే కప్పేశాడు. దీనితో అభిమానులు ఆయన కమిట్మెంట్‌కి ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో ఆయన్ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. సూపర్ సర్ మనసులో ఎంత బాధ ఉన్నా మీరు షోలో చూపించే ఎనర్జీ సూపర్.. మీ డెడికేషన్‌కి, మీ కమిట్మెంట్‌కి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read :
సాయిశ్రీయ ఎఫెక్ట్... యూట్యూబ్‌లో బుల్లెట్టు బండి రికార్డు.. !
'చైసామ్' విడిపోవడానికి అతడే కారణం : దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..!