ప్రభాస్‌కి కోపం తెప్పిస్తున్న పూజాహెగ్డే.. నిర్మాతలు ఏం అన్నారంటే..!
ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లలో పూజాహెగ్డే ఒకరు. టాప్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది ఈ బుట్టబొమ్మ.;
ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లలో పూజాహెగ్డే ఒకరు. టాప్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది ఈ బుట్టబొమ్మ. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న రాధేశ్యామ్ సినిమాలో నటిస్తుంది. అయితే ఎప్పుడు కూల్‌గా కనిపించే ప్రభాస్‌కి పూజాహెగ్డే కోపం తెప్పిస్తుందట. సెట్‌కి పూజా రోజు లేటుగా వస్తుందని, ఆమె తీరు అస్సలు బాలేదని వార్తలు వస్తున్నాయి. ఆమె ప్రవర్తన పట్ల ప్రభాస్ కూడా విసిగిపోయని, అందుకే ఇద్దరి మధ్య రొమాంటిక్ సాంగ్‌ని విడివిడిగా చిత్రికరిస్తున్నట్టుగా వార్తలు రావడంతో ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనిపైన మేకర్స్ స్పందించారు. పూజా మంచి టైం సెన్స్ పాటిస్తుందని, ఆమెతో వర్క్ కూడా చాలా కంఫర్ట్‌గా ఉందని మేకర్స్ తెలిపారు. అంతేకాకుండా వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ అద్భుతమని చెప్పుకొచ్చారు. దీనితో పూజా హేగ్దే పైన వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనని తేలిపోయింది. కాగా ఈ భారీ బడ్జెట్ సినిమాని 2022 జనవరి 14న విడుదల చేయనున్నారు.