Prabhas: 'సీతారామం' ఈవెంట్‌లో ప్రభాస్ ధరించిన టీ షర్ట్ ధర ఎంతంటే..?
Prabhas: సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను రంగంలోకి దింపింది మూవీ టీమ్.;
Prabhas: ఆగస్ట్‌లో సినిమా సందడి సీతారామం, బింబిసార చిత్రాలతో మొదలుకానుంది. ఆగస్ట్ 5న ఈ రెండు చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. అయితే ఈ రెండు సినిమా కథలు పూర్తి భిన్నం. ఇందులో సీతారామం ప్రేమకథ కాగా.. బింబిసార పీరియాడిక్ డ్రామా. రెండు చిత్రాలు పోటాపోటీగా ప్రమోషన్స్ చేస్తుండగా సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను రంగంలోకి దింపింది మూవీ టీమ్.
ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్‌గా మారినా, ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా.. తనకు బాగా కావాల్సిన వారి కోసం సమయాన్ని కేటాయిస్తూనే ఉంటాడు. అందుకే హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఛీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. అంతే కాకుండా ఈ మూవీని థియేటర్లలో చూడమని ప్రేక్షకులతో చెప్పాడు. ఇక ఈ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
కేవలం ఈవెంట్స్‌లో తప్పా ప్రభాస్ ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. అందుకే ప్రభాస్ ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇక సీతారామం ఈవెంట్‌లో ఓ సింపుల్ బ్లాక్ టీ షర్ట్‌లో కనిపించాడు ప్రభాస్. దీంతో ప్రేక్షకులంతా ఈ టీ షర్ట్ గురించి ఆరాతీయడం మొదలుపెట్టారు. సింపుల్‌గా ఉన్నా కూడా ఈ టీ షర్ట్ ధర దాదాపు రూ.20 వేలు ఉంటుందట. ఈ టీషర్ట్‌తో ప్రభాస్‌కు బ్లాక్ అంటే ఎంత ఇష్టమో మరోసారి అర్థమయ్యింది అనుకుంటున్నారు అభిమానులు.