Prabhas: బిజినెస్‌మ్యాన్‌గా మారనున్న ప్రభాస్.. విదేశాల్లో కూడా..
Prabhas: ప్రభాస్ బిజినెస్‌మెన్‌గా మారనున్నాడని టాక్. దానికోసం ఇప్పటికే పక్కా ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాడట.;
Prabhas: ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు సినిమాలతో పాటు బిజినెస్‌ను కూడా హ్యాండిల్ చేస్తున్నారు. రెస్టారెంట్స్, టెక్స్‌టైల్స్.. ఇలా చాలా రంగాల్లో సెలబ్రిటీలు బిజినెస్‌మెన్‌గా, బిజినెస్ ఉమెన్‌గా తమ సత్తా చాటుతున్నారు. ఇక ఇన్నాళ్లకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా బిజినెస్‌మెన్‌గా మారనున్నాడని టాక్. దానికోసం ఇప్పటికే పక్కా ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాడట.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం క్షణం కూడా తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నాడు. అంతే కాకుండా అవన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడం విశేషం. ఇక సినిమా బడ్జెట్‌తో సమానంగా ప్రభాస్ కూడా దాదాపు రూ.100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని ఫిల్మ్ సర్కిల్స్‌లో ఎప్పటినుండో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తన రెమ్యునరేషన్ అంతా పెట్టుబడిగా పెట్టి ప్రభాస్ బిజినెస్‌లోకి దిగనున్నాడట.
ఇప్పటివరకు ప్రభాస్ పూర్తిగా సినీ పరిశ్రమకే పరిమితమయ్యాడు. కానీ మొదటిసారి హోటల్ బిజినెస్‌లోకి అడుగుపెట్టి బిజినెస్‌మెన్‌గా కూడా మారనున్నాడు. త్వరలోనే ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్న ప్రభాస్.. ఇండియాలోనే కాకుండా స్పెయిన్, దుబాయి వంటి ఫారిన్ దేశాల్లో కూడా తన బిజినెస్‌ను విస్తరించనున్నాడట. ఇప్పటికే దీని పనులు మొదలయిపోయాయని సమాచారం. మరి హీరోగా సూపర్ సక్సెస్‌ఫుల్ అయిన ప్రభాస్.. బిజినెస్‌మెన్‌గా ఎంతమేరకు సక్సెస్ అవుతాడో చూడాలి మరి.