Prithviraj Sukumaran: సలార్ సినిమాలో నటించడంపై క్లారిటీ ఇచ్చిన పృథ్విరాజ్ సుకుమారన్..
Prithviraj Sukumaran: ఇటీవల తన అప్‌కమింగ్ సినిమా ప్రమోషన్స్ కోసం మొదటిసారి హైదరాబాద్ వచ్చిన పృథ్విరాజ్ సుకుమారన్.;
Prithviraj Sukumaran: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ బిజీగా గడిపేస్తున్నాడు. అయితే ఈ సినిమాలకు మరింత హైప్ తీసుకొని రావడం కోసం మేకర్స్.. భారీ క్యాస్టింగ్‌ను ప్లాన్ చేస్తున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ప్రభాస్ నటిస్తున్న 'సలార్'లో కూడా మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్.. నటిస్తున్నాడని మూవీ టీమ్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయంపై నేరుగా పృథ్విరాజ్ ఇటీవల ఓ క్లారిటీ ఇచ్చాడు.
'కేజీఎఫ్' చిత్రంతో దేశవ్యాప్తంగా మరో గుర్తుండిపోయే సినిమాను అందించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. దీంతో ప్రభాస్‌తో ఎలాంటి మ్యాజిక్ చేయించనున్నాడో అని హీరో ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఇందులో హీరోయిన్‌గా శృతి హాసన్ నటిస్తుందనే తప్పా.. ఇంకే క్యాస్టింగ్ గురించి మూవీ టీమ్ బయటపెట్టలేదు. కానీ 'రాధే శ్యామ్' ప్రమోషన్స్ సమయంలో సలార్‌లో పృథ్విరాజ్ సుకుమారన్ ఉంటాడు అనే విషయాన్ని బయటపెట్టాడు ప్రభాస్.
ఇటీవల తన అప్‌కమింగ్ సినిమా ప్రమోషన్స్ కోసం మొదటిసారి హైదరాబాద్ వచ్చిన పృథ్విరాజ్ సుకుమారన్.. సలార్ సినిమాపై స్పందించాడు. కోవిడ్ కంటే ముందు ప్రశాంత్.. సలార్ కథతో తన దగ్గరకి వచ్చాడని చెప్పాడు పృథ్విరాజ్. అయితే కథ బాగా నచ్చడంతో తాను కూడా చేస్తానని చెప్పానని అన్నాడు. ప్రభాస్‌తో కలిసి పనిచేయాలని ఉండడం కూడా మూవీ ఓకే చేయడానికి ఓ కారణమని తెలిపాడు.
అయితే కరోనా అనేది వచ్చి అంతా మారిపోయింది కాబట్టి ఇప్పుడు సలార్ కోసం తన డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నానని అన్నాడు పృథ్విరాజ్. కానీ ఒకవేళ అన్నీ కుదిరితే మాత్రం సలార్‌లో కచ్చితంగా భాగమవుతానని క్లారిటీ ఇచ్చారు పృథ్విరాజ్. ఇక ప్రస్తుతం సలార్ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ప్రభాస్ అప్‌కమింగ్ సినిమాల్లో సలారే ముందుగా ప్రేక్షకులను పలకరించనుంది.