Shanmukh Jaswanth: ఆహాలో షణ్నూ 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్..
Shanmukh Jaswanth: డిటెక్టివ్‌గా షణ్నూ నటిస్తున్న వెబ్ సిరీసే ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’.
Shanmukh Jaswanth: ముందుగా సోషల్ మీడియాలో పేరు తెచ్చుకున్న, ఆ తర్వాత యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్‌తో, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులకు దగ్గరయిన వారు చాలామంది ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు షణ్ముఖ్ జశ్వంత్. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ నుండి బిగ్ బాస్ వరకు ఎదిగాడు షణ్మూ. ఇప్పుడు ఏకంగా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫార్మ్ ఆహాతో కలిసి ఓ వెబ్ సిరీస్ కూడా చేశాడు.
కేవలం తెలుగు కంటెంట్ కోసం నిర్మాత అల్లు అరవింద్ ప్రారంభించిన ఆహా.. ఎంతోమంది కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ఎందరో కొత్త దర్శకులు, నటీనటులను ప్రేక్షకులకు పరిచయం చేసింది. అంతే కాకుండా కేవలం యూట్యూబ్ వరకే పరిమితమైన వెబ్ సిరీస్‌లకు ఓటీటీ ప్లాట్ఫార్మ్ ఇచ్చింది. ఇప్పటికే ఎన్నో వెబ్ సిరీస్‌లు ఆహాలో విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ఇది షణ్నూ వంతు.
డిటెక్టివ్‌గా షణ్నూ నటిస్తున్న వెబ్ సిరీసే 'ఏజెంట్ ఆనంద్ సంతోష్'. ఇందులో షణ్నూ తనదైన స్టైల్ కామెడీ పండించి మెప్పించనున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ సిరీస్‌లో రూల్స్ చేసే డిటుక్టివ్గా షణ్నూ లుక్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇందులో ఇతర ముఖ్య పాత్రలో వైషాలీ రాజ్, జక్కాస్ పృథ్వీ నటించారు. ఈ సిరీస్ ఆహాలో జులై 22 నుండి స్ట్రీమ్ కానుంది.
Here it is..#AgentAnandSantosh Trailer 🔥 #ShanmukhJaswanth https://t.co/stTbvyS50I pic.twitter.com/5fAqKiXdEN
— Parinda #AAS (@its_sha_here) July 15, 2022