‘ఆది పురుష్’ టికెట్ ధర పెంపునకు గ్రీన్‌సిగ్నల్
ప్రభాస్ కీలక పాత్రలో ఓం రౌత్ రూపొందించిన ‘ఆది పురుష్’ మూవీ ఈ నెల 16న విడుదల కానుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ‘ఆది పురుష్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి;
ప్రభాస్ కీలక పాత్రలో ఓం రౌత్ రూపొందించిన ‘ఆది పురుష్’ మూవీ ఈ నెల 16న విడుదల కానుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ‘ఆది పురుష్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో టికెట్‌పై 50 రూపాయలు పెంచింది. మొదటి మూడు రోజులు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ఆరో షోకూ అనుమతి ఇచ్చింది. ఉదయం 4గంటల నుంచి ‘ఆది పురుష్’ను థియేటర్‌లలో ప్రదర్శించవచ్చు. ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ ధరపై 50 రూపాయలు పెంచినట్లు సమాచారం