Anushka Wish To Prabhas : డార్లింగ్‌కి స్వీటీ బర్త్ డే విషెస్..!
Anushka Wish To Prabhas : టాలీవుడ్ డార్లింగ్, పాన్ ఇండియా మూవీ హీరో ప్రభాస్ నేడు 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు...;
Anushka Wish To Prabhas : టాలీవుడ్ డార్లింగ్, పాన్ ఇండియా మూవీ హీరో ప్రభాస్ నేడు 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు... ఈ సందర్భంగా అభిమానులతో పాటుగా సెలబ్రిటీలు ఆయనకీ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అందులో భాగంగానే టాలీవుడ్ హీరోయిన్ స్వీటీ అనుష్క కూడా తన రీల్ హీరోకి స్పెషల్ విషెస్ తెలిపింది. లైఫ్ లో వచ్చే ప్రతి అంశంలో ప్రభాస్ బెస్ట్ గా ఉండాలని అలాగే తన స్టోరీస్ అన్నీ విజయవంతం అయ్యి అందరి హృదయాలను గెలుచుకోవాలని కోరుకుంటున్నానని స్పెషల్ బర్త్ డే విషెష్ ని తెలియజేసింది.
కాగా ప్రభాస్, అనుష్క ఇప్పటివరకు మూడు సినిమాలలో కలిసి నటించారు. అవే బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రాలు... ఇదిలావుండగా ప్రభాస్ ఇప్పుడు అయిదు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ అప్ కమింగ్ మూవీ రాధేశ్యామ్ షూటింగ్ చివరిదశలో ఉంది.