Vanitha Vijaykumar : నటి వనిత విజయ్ కుమార్ ఇంట విషాదం..!
Vanitha Vijaykumar : నటి వనిత విజయ్ కుమార్ ఇంట విషాదం నెలకొంది. తన అక్క కూతురు అనిత గుండెపోటుతో మృతి చెందారు.;
Vanitha Vijaykumar : నటి వనిత విజయ్ కుమార్ ఇంట్లో విషాదం నెలకొంది. తన అక్క కూతురు అనిత గుండెపోటుతో మృతి చెందారు. ఈ వార్తను సోషల్ మీడియాలో పంచుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యారు వనితా.
" ఓ విషాదకర వార్తతో ఈ ఉదయం నిద్ర లేచాను. నాకు పెద్దకూతురు లాంటిది.. దేవుడిచ్చిన కూతురులాంటిది.. న్యూఢిల్లీలో సర్జరీ చేసుకున్న తర్వాత గుండెపోటు రావడంతో ప్రాణాలను కోల్పోయింది. మా నాన్న(విజయ్ కుమార్ ) సోదరుడి కూతురు ఇంద్ర.. ఆమె సింగపూర్‌లో ఉంటుంది. ఇంద్ర చిన్న కూతురే అనిత. అనిత అన్నింటిని బాగా అర్ధం చేసుకుంటుంది. ఎప్పుడూ నాకు మద్దతుగా నిలబడుతుంది.
నన్ను, నా పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి ఇప్పుడు అర్ధాంతరంగా వెళ్ళిపోయింది. ఆమె తల్లిదండ్రులు సింగపూర్‌లో ఉండటంతో తన మృతదేహాన్ని కూడా అక్కడికే తరలించారు. ప్రస్తుతం నేను దుబాయ్‌లో ఉన్నాను. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. దీనిని నేను ఇప్పటికి నమ్మలేకపోతున్నాను. నా డార్లింగ్ అనిత ఎప్పటికీ నా కూతురే" అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది వనితా.