Radheshyam Teaser : అందుకే 'రాధేశ్యామ్' కి వ్యూస్ తగ్గాయట..!
Radheshyam Teaser : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హేగ్దే కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం రాధేశ్యామ్.. యూవీ క్రియేషన్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ – ప్రమోద్ – ప్రసీద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు;
Radheshyam Teaser : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హేగ్దే కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం రాధేశ్యామ్.. యూవీ క్రియేషన్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ – ప్రమోద్ – ప్రసీద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ టీజర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.
ఇప్పటికే టాలీవుడ్ హైయెస్ట్ వ్యూడ్ టీజర్ గా రికార్డు సృష్టించింది. అయితే 63మిలియన్ వ్యూస్ ఒక్క సారిగా 62 మిలియన్స్‌కి వచ్చాయి. ఇలా తగ్గడంపై అభిమానులు యూట్యూబ్‌ని ప్రశ్నించారు. దీనిపైన యూట్యూబ్ స్పందించింది. కొన్ని సార్లు యూట్యూబ్ వ్యూస్ కౌంట్ అప్డేట్ చెయ్యడం అనేది స్లో గా జరుగుతుంది అని అలాగే కొన్ని సందర్భాల్లో ఆలస్యం కూడా అవ్వొచ్చని పేర్కొంది.
యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.