Dehradun : డెహ్రాడూన్‌లో మామిడిపండ్ల లారీ బోల్తా.. సంచులతో ఎగబడిన స్థానికులు

Update: 2025-07-18 11:15 GMT

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో మామిడిపండ్ల లారీ బోల్తా పడింది. డెహ్రాడూన్‌లోని రిస్పానా బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మామిడిపండ్లు మొత్తం రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో స్థానికులు మామిడి పండ్ల కోసం పెద్ద ఎత్తున గుమిగూడారు. కొందరు సంచులతో, బుట్టలతో వచ్చి మామిడి పండ్లను తీసుకెళ్లారు. ఆ ప్రదేశం "ఉచిత మామిడి మార్కెట్" లాగా మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రమాదం కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Tags:    

Similar News