Suicide : కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు ఆత్మహత్య

Update: 2025-08-05 06:12 GMT

పెళ్లి తరువాత మొదటి రాత్రి జరగాల్సి ఉండగా నవవధువు ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులతో కళకళలాడిన ఆ ప్రాంతం చిన్నబోయింది, కాళ్ల పారాణి ఆరకముందే ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం మణికంఠ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఉదయం పెళ్లి జరిగి కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు ఆత్మహత్య చేసుకుంది. సోమందేపల్లి మణికంఠ కాలనీలో ఉంటున్న కృష్ణమూర్తి వరలక్ష్మికి ఏకైక సంతానం హర్షిత, నిన్న హర్షిత వివాహం కర్ణాటక ప్రాంతంలో జరగగా , మొదటి రాత్రికి ఏర్పాట్లు చేస్తుండగా ఇంటిలో ఓ గదిలోకి వెళ్లి నవవధు హర్షిత ఆత్మహత్య చేసుకుంది, తల్లిదండ్రులు హుటాహుటిన పెనుగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే హర్షిత చనిపోయినట్టు డాక్టర్లు తెలియజేశారు. ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియ రాలేదు.

Tags:    

Similar News