Robotic Elephant : త్రిసూరు కృష్ణ ఆలయంలో రోబోటిక్ ఏనుగు సందడి

Update: 2025-02-06 10:00 GMT

కేరళ, త్రిసూర్‌లో ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో వార్షిక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ఏనుగులు సందడి చేస్తున్నాయి. అసలు సిసలైన ఏనుగుల స్థానంలో రోబోటిక్‌ ఏనుగు దర్శనమిచ్చాయి. పెటా సభ్యులు ఇచ్చిన రోబొటిక్‌ ఏనుగుకు అంబారీ కట్టారు నిర్వాహకులు. ఏనుగు 11 అడుగుల ఎత్తు, 800 కిలోల బరువు ఉంటుంది. ఐరన్ ఫ్రేమ్స్, రబ్బర్ కోటింగ్‌తో దీన్ని తయారుచేశారు. అసలైన ఏనుగును తలపించేలా తొండం, చెవులను కదుపుతూ ఉంటుంది. మావటి ఓ బటన్ నొక్కితే అది తల, తోక, చెవులను ఊపడంతోపాటు భక్తులకు ఆశీర్వాదాలు అందిస్తుంది. తొండంతో నీళ్లు విరజిమ్ముతుంది. ఇలాంటి పనులు చేసేందుకు ఈ ఏనుగు లోపల కొన్ని ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చారు. ఇనుప చట్రానికి రబ్బరు తొడుగు వేసి ఈ ఏనుగును రూపొందించారు. ఏనుగులను హింసించడం, ఏనుగు చేసే హింసను నిరోధించే క్రమంలో ఈ రోబో ఏనుగు ఒక కొత్త ప్రయోగంగా చెప్పుకోవచ్చు. 

Tags:    

Similar News