Central Minister : కేంద్ర మంత్రి సూపర్ డాన్స్...స్టెప్పులతో అదరగొట్టిన రామ్మోహన్ నాయుడు
రాజకీయాలు, మీటింగ్ లతో ఫుల్ బిజీ గా ఉండే ఓ కేంద్ర మంత్రి కాసేపు సరదాగా చిల్ అయ్యారు. తమ బంధువుల వివాహంలో పాల్గొన్న మంత్రి ఉత్సాహంగా స్టెప్పులు వేసారు. సీటీ కొట్టాలోయి అనే పాటకు హుషారుగా డాన్స్ వేస్తూ అందరిని అలరించారు. కాగా ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ కేంద్ర మంత్రి ఎవరో కాదండోయ్ ...మన రామ్మోహన్ నాయుడు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కింజరపు రామ్మోహన్ నాయుడు...ఇటీవలే శ్రీకాకుళం లో జరిగిన తమ బంధువుల వివాహానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా వేదిక ఎక్కిన ఆయన...తన కజిన్స్ తో కలిసి ఉత్సాహంగా కాలు కదిపారు. కాగా ఆయన స్టెప్పులు అందరిని అలరిస్తున్నాయి. ఇక రామ్మోహన్ నాయుడు అభిమానులు ఐతే ఈ వీడియో ను ఫుల్ గా షేర్ చేస్తున్నారు.