ఆఫ్గనిస్తాన్‌లో ఉన్న తాలిబన్ల ప్రభుత్వం సైతం భారత్ వైపే నిలిచింది. కశ్మీర్‌లో ఉగ్రదాడులను ఖండించిన తాలిబన్లు ఇండియాకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ పరిణామంలో పాక్ మరింత ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారత ప్రతినిధుల బృందం కాబూల్‌లో తాలిబన్ అగ్ర నాయకత్వాన్ని కలిసి .. ఫహల్గావ్ ఉగ్రదాడులు, తదనంతర పరిణామాలపై చర్చించింది. ఈ సందర్భంగా రెండు దేశాల ప్రతినిధులు పలు ద్వైపాక్షిక అంశాలపైనా చర్చించారు. భారత్‌తో సత్ సంబంధాలు కొనసాగించేందుకు తాలిబన్లు ఆసక్తిని కనబరిచినట్లు తెలుస్తోంది.