Russia President Putin : పుతిన్ కారులో పేలుడు

Update: 2025-03-31 13:00 GMT

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు చెందిన అత్యంత లగ్జరీ కారు లిమోజిన్లో భారీ పేలుడు సంభవించింది. మాస్కోలో జరిగిన ఈ ఘటన అధ్యక్షుడి భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తోంది. రష్యా మీడియా వెల్లడించిన కథనాల ప్రకారం.. లిమోజిన్ కారు లుబియాంకాలోని ఎఫ్ఎస్బీ ప్రధాన కార్యాలయం సమీపంలో కాలిపోతూ కనిపించింది. తొలుత కారు ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. ఆ తర్వాత వాహనంలోకి వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు సమీపంలోని రెస్టారెంట్ సిబ్బంది మంటలను ఆర్పేప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలో వాహనం నుంచి దట్టమైన నల్లటి పొగ రావడం, కారు వెనుక భాగం దెబ్బతినడం కనిపించింది. పేలుడుకుగల కారణం ఇంకా తెలియరాలేదని, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని రష్యన్ మీడియా పేర్కొంది. ఈ కారును ప్రెసిడెన్షియల్ ఎస్టేట్ డిపార్ట్ మెంట్ పర్యవేక్షిస్తుంటుందని తెలిపింది. పేలుడుపై దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొంది. కాగా, పుతిన్ ఆరోగ్యం గురించి ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్స్కీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News