CASE: వైసీపీ ఎమ్మెల్యేపై కేసు

CASE: వైసీపీ ఎమ్మెల్యేపై కేసు
X
ఓటర్‌పై దాడి కేసులో శివకుమార్‌పై కేసు.... రక్షణ కల్పించాలన్న బాధితుడు

గుంటూరు జిల్లా తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ కేంద్రంలో ఓటరుపై దాడి చేసిన శివకుమార్ .., మరో ఏడుగురిపై FIR నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదుపై IPC సెక్షన్లు 341, 323 కింద కేసు నమోదుచేసినట్టు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఐతానగర్ పోలింగ్ స్టేషన్ కు కుటుంబసభ్యులు, అనుచరులతో కలిసి వచ్చిన శివకుమార్ క్యూలైన్ లో కాకుండా నేరుగా ఓటేసేందుకు వెళ్తుండగా.... సుధాకర్ అభ్యంతరం చెప్పారు. ఇందుకు ఆగ్రహించిన శివకుమార్ ...... సుధాకర్ చెంపపై కొట్టారు. అంతే వేగంగా స్పందించిన సుధాకర్... MLA చెంప చెళ్లుమనిపించారు. ఈ పరిణామంతో రెచ్చిపోయిన శివకుమార్ అనుచరులు సుధాకర్ ను విచక్షణారహితంగా కొట్టారు.

నా నైజం అదే

ఓటు వేసేందుకు క్యూలో నిల్చోవాలని చెప్పినందుకే తనపై వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివశంకర్ ఆయన అనుచరులు విచక్షణా రహితంగా దాడి చేశారని బాధితుడు సుధాకర్ తెలిపారు. తెనాలిలోని ఐతా నగర్ పోలింగ్ కేంద్రంలో తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల దాడిలో గాయపడిన సుధాకర్ ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని సుధాకర్ చెప్పారు. అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం చిన్నతనం నుంచి తన అలవాటని.. ఆ వైఖరి వల్లే శివశంకర్ ను నిలదీసినట్లు సుధాకర్ తెలిపారు.

మరో ఎమ్మెల్యేపై కేసు

YSRజిల్లా మైదుకూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై.. పోలీసులు ఎస్సీఎస్టీ కేసు నమోదు చేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా....... చాపాడు మండలం చిన్నగులవలూరులో ఇద్దరు తెలుగుదేశం ఏజెంట్లపై.. వైకాపా కార్యకర్తలు దాడి చేయగా.... ఈ ఘటనపై తెలుగుదేశం మైదుకూరు అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రఘురామిరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆయన అనచురులు 11 మందిపై కూడా SC,ST కేసు నమోదైంది. ఈ కేసుపై..దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. అటు.. నిన్నటి దాడిలో గాయపడిన తెలుగుదేశం ఏజెంట్లు ఉగ్ర నరసింహులు, వినోద్ కుమార్ కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags

Next Story