AP : సజ్జల భార్గవ్‌రెడ్డిపై సీఐడీ కేసు నమోదు

AP : సజ్జల భార్గవ్‌రెడ్డిపై సీఐడీ కేసు నమోదు

వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిపై సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబుపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వర్ల రామయ్య ఇచ్చిన ఫిర్యాదుతో ఈసీ ఆదేశాల మేరకు CID అధికారులు చర్యలు తీసుకున్నారు. కాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుతో చంద్రబాబు, లోకేశ్ సహా పలువురు టీడీపీ నేతలపై FIR రిజిస్టర్ అయిన విషయం తెలిసిందే.

సజ్జల భార్గవ్ ఆధ్వర్యంలో ఓటర్లను, పింఛన్ లబ్ధిదారులను తప్పుదోవ పట్టించేలా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రచారం చేశారని టీడీపీ నేత వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా పింఛన్ల ఇంటికి ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని వైఎస్సార్‌సీపీ తప్పుడు ప్రచారం చేశారని టీడీపీ చెబుతోంది.

రాష్ట్రంలో వృద్ధులకు ఏప్రిల్ 1న పింఛన్లు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని.. సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగిందని.. రాష్ట్ర వ్యాప్తంగా ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రచారం చేశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేయగా.. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు సీఐడీ నుంచి నివేదిక వెళ్లాల్సి ఉంది. అనంతరం ఎలాంటి చర్యలు ఉంటాయన్నది చూడాలి.

Tags

Next Story