AP : సీఎం జగన్ పవర్ పంచ్.. టాప్ గేర్

AP : సీఎం జగన్ పవర్ పంచ్.. టాప్ గేర్

ఏపీలో ఎన్నికల ప్రచారానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు జగన్ రెడీ అయ్యారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ముమ్మరం చేశారు. గురువారం మూడు సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి ప్రచారానికి వెళ్తారు. కర్నూలు, కల్యాణదుర్గం, కోడూరులో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

కర్నూలులో మధ్యాహ్నం ఎన్నికల ప్రచారం తర్వాత అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో, కోడూరులో భారీ బహిరంగ సభలకు జగన్ హాజరుకానున్నారు. కూటమి నేతలే టార్గెట్‌గా విమర్శలు చేయనున్నారు.

చంద్రబాబు, పవన్, బీజేపీ నేతలే లక్ష్యంగా జగన్ మరింత పవర్ చూపనున్నారని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story