AP: ఓట్ల లెక్కింపునకు పకడ్బంధీ ఏర్పాట్లు

AP: ఓట్ల లెక్కింపునకు పకడ్బంధీ ఏర్పాట్లు
X
ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా సమీక్ష … హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక...

ఆంధ్రప్రదేశ్‌లో రేపటి ఓట్ల లెక్కింపు కోసం అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద... అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. ఫలితాల రోజు ఎవరైనా హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజకీయపార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజలందరూ.... పోలీసులకు సహకరించాలని కోరారు. ఓట్ల లెక్కింపుపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. సచివాలయం నుంచి రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు... జిల్లాల వారీగా చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం ఓట్ల లెక్కింపునకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబులేషన్, I.T. సిస్టంల ఏర్పాటుపై C.E.O. అనేక సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తదుపరి ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన, స్టాట్యూటరీ నివేదిక, రౌండ్ వారీగా నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు... ఈ నెల 8లోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు విధానంపై సూచనలు చేశారు.


శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో రేపు ఉదయం ఎనిమిది గంటలకు కౌటింగ్ ప్రక్రియ మొదలవుతుందని కలెక్టర్ జిలానీ సమూన్ వెల్లడించారు. జిల్లాలో తొలి ఫలితం ఆమదాలవలస వచ్చే అవకాశం ఉందన్నారు. ఎన్నికల ఫలితాల రోజు అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని... ఎన్టీఆర్ జిల్లా మైలవరం D.C.P. కంచి శ్రీనివాసరావు హెచ్చరించారు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మాక్‌ డ్రిల్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పోలీసులకు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపును పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహిస్తామని... ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు చెప్పారు. పార్లమెంట్ ,అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.

అన్నమయ్య జిల్లాలో సాయి ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు.. జిల్లా కలెక్టర్ అభిషిక్త్‌ కిషోర్ తెలిపారు. రాయచోటి, రాజంపేట, తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లి నియోజకవర్గ సంబంధించి 12 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Tags

Next Story