YS Jagan Hot Comments : కొద్దిమంది అటు ఓటేయడం వల్లే ఓడాం.. జగన్ హాట్ కామెంట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు ( N. Chandrababu Naidu ) , కూటమి నేతలు రావణకాష్టం చేస్తున్నారని ఫైరయ్యారు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ( YS Jagan Mohan Reddy ). వైఎస్ఆర్ విగ్రహాలను తగలబెడుతున్నారునీ.. ఈ పాపాలన్నీ శిశుపాలుడి పాపాలలా పెరుగుతున్నాయన్నారు. దాడులతో భయపెట్టి చేసే రాజకీయాలు సరికాదని హితవు పలికారు.
నెల్లూరు సెంట్రల్ జైలులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. "ప్రజల్లో వ్యతిరేకతతో వైసీపీ ఓడిపోలేదు. కూటమి హామీల వల్లే 10శాతం ఎక్కువ మంది ప్రజలు ఎన్డీయేకు ఓటు వేశారు. దీంతో సీట్ల నంబర్లలో తేడా వచ్చింది" అని జగన్ అన్నారు.
సీఎం చంద్రబాబు ప్రభుత్వం తమ ధోరణి మార్చుకోవాలనీ.. ఆయనకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని మాజీ సీఎం జగన్ అన్నారు. మంచి పనులు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com