AP : జగన్‌ను పల్లెత్తు మాట అనని మోడీ.. అసలు రాజకీయం ఇదే

చిలకలూరిపేట (Chilakaluripeta) సభ సక్సెస్ ఎన్డీయే కూటమికి బలాన్నిచ్చింది. ఐతే.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ప్రధాని మోడీ (PM Modi)... జగన్ ను (CM Jagan) ఒక్క మాట కూడా అనకపోవడంపై పొలిటికల్ గా తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ తమపై ఇంకా ఎంతో కొంత దయ చూపుతారని వైసీపీ నేతలు ఆశ పడుతున్నారు.
పొలిటికల్ గానే కాదు... కేసులు ఇతర అంశాల్లోనూ ప్రధాని మోడీ తమపై జాలి చూపుతారని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. అందుకే మోడీ విమర్శలు చేయలేదని.. తమను తాము సంతృప్తి పరుచుకునేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలి పెట్టడం లేదు. ఏపీలో పరిస్థితుల్ని అంచనా వేసిన బీజేపీ.. పాత కూటమి కడితేనే వైసీపీని ఎదుర్కోగలమని బలంగా నమ్మింది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన కూటమి ప్రయత్నాలకు సహకరించింది. అందులో భాగంగానే.. ప్రధాని మోడీ మొదటి బహిరంగసభకు కూటమి తరపున హాజరయ్యారు.
మోడీ.. జగన్ పై చూపిన సాఫ్ట్ కార్నర్ ఇపుడు పొలిటికల్ గా బర్నింగ్ టాపిక్ అయింది. మొదటి సభ కాబట్టి నడిచింది కానీ.. పోను పోను సభల్లో ఇలాగే చేస్తే కూటమి కట్టినా ఫలితం రాదన్నట్టు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అవినీతి పరుడైన జగన్ ను జైలుకు పంపిస్తామంటూ కేంద్రం నుంచి కామెంట్లు వస్తేనే తప్ప ఓట్లు భారీస్థాయిలో బదిలీ జరగవని అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com