AP : రాజకీయ బాహుబలి చంద్రబాబు కళ్లుచెదిరే ఫీట్.. ఇదెక్కడి సునామీరా నాయనా!

ముసలోడు ముసలోడు అంటూ జగన్ అంట్ టీమ్ ఎద్దేవా చేశారు కానీ.. వయసులో పెద్దవాడే కానీ మామూలోడు కాదని ప్రూవ్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని ఆయన పడిలేచిన కెరటంలా ఎగసేలా చేయగలిగారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం తన సత్తాను చాటి విజయదుంధుబిని మోగించింది. 43 ఏళ్లుగా అనేక ఆటుపోట్లు, అగచాట్లు ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీ కష్టాలను, కడగండ్లను అధిగమించి రికార్డ్ స్థాయి విజయాన్ని నమోదు చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం అనేక ఇబ్బందులు, అగచాట్లను టీడీపీతో పాటు పార్టీ అధినేత చంద్రబాబు ఎదుర్కొంటూ వచ్చారు.
ఆనాడు వైసీపీ సృష్టించిన 151 సీట్ల సునామితో తెలుగుదేశం ఫినిష్ అని అనేకమంది మాట్లాడారు. ఇంకోవైపు భౌతికదాడులు, అరెస్ట్లతో వైసీపీ దౌర్జన్యకాండకు తెగబడ్డా టీడీపీ అధినేత చంద్రబాబు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన పోరాటాన్ని కొనసాగిస్తూ పార్టీని నిలబెట్టేందుకు సర్వశక్తులూ ఒడ్డుతూ వచ్చారు. టీడీపీని దెబ్బతీసేందుకు మనుగడ కోల్పోయేలా చేయాలన్న కుట్రతో అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రి జగన్ జైలుకు పంపినా ఆ తర్వాత బయటకొచ్చి పవన్ సాయంతో మరో వేవ్ క్రియేట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో సుడిగాలిలా తిరిగారు. తన అనుభవంతో రాజకీయం తిప్పారు. జనం మెప్పు పొంది ఏపీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని అఖండ మెజారిటీని సాధించి రాజకీయ బాహుబలి అనిపించుకున్నారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com