MODI: చంద్రబాబు-పవన్‌తో మోదీ ప్రత్యేక భేటీ

MODI: చంద్రబాబు-పవన్‌తో మోదీ ప్రత్యేక భేటీ
వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్న మోదీ.. ఎన్డీయే ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని వెల్లడి....

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని... ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని.., ఏపీలో కూటమి అభ్యర్థుల విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మహిళలు, యువత మద్దతు... మూడు పార్టీలకూ పుష్కలంగా ఉందన్నారు. విజయవాడ రోడ్‌షో అనంతరం తెలుగుదేశం, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌తో ప్రధాని... 10 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఏపీలో సాగిన తన రెండు రోజుల పర్యటనపై ప్రధాని నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన ర్యాలీ ఎంతో ఉత్సాహంగా సాగిందని.. సంతృప్తి, సంతోషాన్ని వ్యక్తం చేశారు. రోడ్‌ షో ముగిశాక గ్రీన్ రూమ్‌లో... చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో మోదీ 10నిమిషాలకు పైగా ఏకాంతంగా భేటీ అయ్యారు. ఎన్డీయే ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని.., మంచి విజయాన్ని కూటమి సాధించబోతోందని చంద్రబాబు, పవన్‌తో మోదీ అన్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఎండ వేడిమి తీవ్రంగా ఉందని... ఆ ప్రభావం పోలింగ్‌పై పడకుండా చూడాలని చంద్రబాబు, పవన్‌కు మోదీ సూచించారు.


పోలింగ్‌ రోజు ఉదయం 7 నుంచి 10 గంటల లోపే ఎక్కువ మంది ఓటర్లు... తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలన్నారు. పోలింగ్‌ శాతం ఎంత పెరిగితే ఎన్డీయేకు అంత లాభమని వారికి మోదీ చెప్పారు. తనను ఆదరించిన ఏపీ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు జగన్ ప్రభుత్వంపై.. తీవ్ర అగ్రహం, అసంతృప్తితో ఉన్నారన్న నివేదికలు ఉన్నాయని.. మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి జోష్ పట్ల మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో కలిసి విజయవాడలో నిర్వహించిన రోడ్ షో మధురానుభూతిని కలిగించిందని... ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇటీవల ఏపీలో జరిపిన పర్యటన ద్వారా ప్రజా మద్దతు పెద్ద ఎత్తున కూటమికే ఉందన్నది స్పష్టమైoదన్నారు. మహిళలు, యువ ఓటర్లు కూటమిని ప్రోత్సహిస్తుoడటం శుభపరిణామమని... సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.

విజయవాడలో మోదీ, పవన్ కళ్యాణ్‌తో కలిసి నిర్వహించిన రోడ్ షో సరికొత్త చరిత్ర సృష్టించిందని... చంద్రబాబు ట్వీట్ చేశారు. రోడ్ షో లో పాల్గొన్న సోదర సోదరీమణులకు కృతజ్ఞతలు తెలిపారు. భారీ ప్రజా స్పందన ఎంతో థ్రిల్ కలిగించిందన్నారు. మూడు పార్టీల అధినేతలకు లభించిన ప్రజాభిమానం... ఎన్నికల ఫలితాల్లో ఆశాజనక వాతావరణానికి నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో.. జూన్ 4న కొత్త ప్రభుత్వం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే... ప్రధాని మోదీ ట్వీట్‌కు సమాధానమిచ్చిన చంద్రబాబు.. రోడ్ షో ద్వారా ఏపీ ప్రజల్లో.., ముఖ్యంగా మహిళలు, యువతలో కొత్త ఆశలు నింపామన్నారు. రోడ్ షో మరపురానిదన్నారు. మోదీ తన మధురానుభూతులను... ఏపీ ప్రజలతో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆంద్రప్రదేశ్‌కు నరేంద్రమోదీ ఇచ్చిన భరోసాకు కృతజ్ఞతలంటూ ట్వీట్‌ చేశారు. మోదీ తలపెట్టిన వికసిత్‌ భారత్‌ కోసం తాము నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు... జనసేన పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ... ఏపీలో పాల్గొన్న ఎన్నికల ప్రచారం ఎంతో విలువైందన్నారు. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story