AP : స్వేచ్ఛను హరించడం వల్ల వచ్చిన ఫలితమిది: చంద్రబాబు

AP : స్వేచ్ఛను హరించడం వల్ల వచ్చిన ఫలితమిది: చంద్రబాబు
X

వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఐదేళ్లు మా కార్యకర్తలకు నిద్ర లేకుండా చేశారు. అహంకారులైన పాలకులకు ప్రజలు బుద్ధి చెప్పారు. కూటమికి 58.38%ఓట్లు పడ్డాయి. టీడీపీకి 45%, వైసీపీ కి 39% ఓట్లు వచ్చాయి. స్వేచ్ఛను హరించడం వల్ల వచ్చిన ఈ ఫలితం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది’ అని అన్నారు.

తాము ఎన్డీఏలోనే ఉన్నామని, దేశంలో ఎన్నో రాజకీయ పరిణామాలను చూశానని, ఎన్డీఏ సమావేశానికి తాను వెళుతున్నానని ఎలాంటి సందేహాలు వద్దని ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెబుతానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమితోనే తమ రాజకీయ పయనం కొనసాగుతుందని ఢిల్లీ వెళ్లేముందు చంద్రబాబు స్పష్టత ఇచ్చారు.

సీఎంగా 4వసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 9న ఉ.11.53 గంటలకు ఆయన పదవీ ప్రమాణం చేస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. 12న కూడా పండితులు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. మరీ ఆలస్యమవుతుందనే కారణంతో వద్దనుకున్నట్లు సమాచారం. విజయవాడ-గుంటూరు హైవే పక్కనున్న పొలాలు/స్థలాలను టీడీపీ నేతలు అన్వేషిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో వేదికను ఖరారు చేయనున్నారు.

Tags

Next Story