MODI: మాది అభివృద్ధి మంత్రం... జగన్‌ది అవినీతి తంత్రం

MODI: మాది అభివృద్ధి మంత్రం... జగన్‌ది అవినీతి తంత్రం
ఏపీ శాండ్‌, ల్యాండ్‌ మాఫియా... నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ

ఎన్డీఏది అభివృద్ధి మంత్రం అయితే వైసీపీది అవినీతి తంత్రం అని ప్రధాని మోదీ అన్నారు. ఏపీలో శాండ్‌, ల్యాండ్ మాఫియా విజృంభిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఏపీలో కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులను సైతం వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీలో రాజమహేంద్రవరం, అనకాపల్లిలో జరిగిన బహిరంగసభల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సభకు.. పవన్‌, లోకేశ్‌, పురందేశ్వరి హాజరుకాగా గతంలో చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధిలో నెంబర్ వన్‌గా ఉండేదని, జగన్ ఐదేళ్ల హయాంలో..... పాలన పట్టాలు తప్పిందని మోదీ ధ్వజమెత్తారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే... డబుల్ ఇంజిన్ సర్కారు అవసరమని స్పష్టం చేశారు. ఏపీలో మద్యనిషేధం పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ తర్వాత సిండికేట్ గా తయారై వ్యాపారం చేస్తోందని మోదీ విమర్శించారు.


తర్వాత అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో కూటమి సభలో చంద్రబాబుతో కలిసి పాల్గొన్న మోదీ విశాఖ రైల్వే జోన్ కార్యాలయానికి వైకాపా ప్రభుత్వం భూమి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. జగన్‌ ప్రభుత్వ విధానాలతో చక్కెర పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒకటేనన్న ప్రధాని ఏపీలో దేవాలయాలపై దాడులు జరిగాయని, కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయాలను రక్షిస్తామని హామీ ఇచ్చారు. జగన్ సర్కార్‌పై మోదీ నిప్పులు చెరిగారు. ఏపీలో అవినీతి సర్కార్ నడుస్తోందని మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్‌ కార్యాలయానికి వైసీపీ ప్రభుత్వం భూమి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్రం ఇళ్లు ఇచ్చినా జగన్ నిర్మించలేదని ధ్వజమెత్తారు.


తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకున్న జగన్... ఆయన సుజల స్రవంతిని మాత్రం విస్మరించారని... మోదీ మండిపడ్డారు. పోలవరం కోసం కేంద్రం 15 వేల కోట్లు ఇస్తే... ప్రాజెక్టు నిర్మాణాన్ని జగన్‌ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో చక్కెర పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో చెరకు రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతామని ప్రధాని భరోసా ఇచ్చారు. వైసీపీ, కాంగ్రెస్‌.. రెండూ ఒకటేనని... ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఏపీలో శాండ్‌, ల్యాండ్ మాఫియా విజృంభిస్తున్నాయన్నారు. ఏపీలో దేవాలయాలపై దాడులు జరిగాయని... కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయాలను రక్షిస్తామని మోదీ హామీ ఇచ్చారు. అంతకు ముందు రాజమహేంద్రవరం వేమగిరిలో కూటమి నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి సున్నా.. అవినీతి వంద శాతం అని మోదీ విమర్శించారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధిలో నెంబర్ వన్ గా ఉన్న ఏపీ.... జగన్ ఐదేళ్ల హయాంలో పాలన పట్టాలు తప్పిందని ధ్వజమెత్తారు.

Tags

Read MoreRead Less
Next Story