CBN: శాంతి భద్రతలను పరిరక్షించండి
![CBN: శాంతి భద్రతలను పరిరక్షించండి CBN: శాంతి భద్రతలను పరిరక్షించండి](https://www.tv5news.in/h-upload/2024/05/14/1261289-7.webp)
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ అధికారపార్టీ దాడులను ధైర్యంగా ఎదిరించిన తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలపై వైసీపీ మూకలు దాడులకు తెగబడుతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పల్నాడు, చంద్రగిరి సహా పలుచోట్ల ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంపై... ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈసీ, పోలీసు ఉన్నతాధికారులు ఏపీలో శాంతి భద్రతలను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ మేరకు మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడిన చంద్రబాబు ఆయా దాడులకు బాధ్యులపై చర్యలు చేపట్టాలని కోరారు. పోలింగ్ తర్వాత మాచర్లలో వైసీపీ MLA పిన్నెల్లి ప్రణాళికబద్ధంగా దాడులకు పాల్పడుతున్నారని డీజీపీకి చెప్పారు. మాచర్లలో వందల మంది ప్రైవేట్ సైన్యంతో చేస్తున్న దాడులను... అరికట్టడానికి అదనపు బలగాలను పంపాలని కోరారు. అనేక జిల్లాల్లో పోలింగ్ తర్వాత జరుగుతున్న దాడులను ప్రస్తావించిన చంద్రబాబు శాంతి, భద్రతల పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రెండోరోజూ దాడులు
పల్నాడు, అనంతపురం సహా వేర్వేరు జిల్లాల్లో వైసీపీ మూకలు వరుసగా రెండోరోజు అరాచకం సృష్టించాయి. మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేయగా తాడిపత్రిలో తెలుగుదేశం నాయకుడు సూర్యమని ఇంటిపై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని తెలుగుదేశం కార్యకర్తలు తిప్పికొట్టారు. ఈ క్రమంలో సీఐకి గాయాలయ్యాయి. సత్యసాయి, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో కూడా వైసీపీ మూకలు తెలుగుదేశం కార్యకర్తలు, ఆస్తులపై దాడులకు దిగాయి. సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో అనేకచోట్ల అరాచం సృష్టించిన వైసీపీ మూకలు రెండోరోజు కూడా దాడులు కొనసాగించాయి.
పల్నాడు జిల్లా మాచెర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లలో గాయపడినవారిని పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి కారంపూడిలో భయానక వాతావరణం సృష్టించారు. తెలుగుదేశం కార్యాలయం తలుపులు బద్దలు కొట్టి రాళ్లు రువ్వి కుర్చీలు ధ్వంసం చేశారు. తెలుగుదేశం నేత జానీబాషా వాహనానికి నిప్పు పెట్టారు. బైకులను తగులబెట్టారు. వైసీపీ మూకలను నిలువరించేందుకు యత్నించిన సీఐ నారాయణని పిన్నెల్లి అనుచరులు కొట్టగా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసు వాహనం ధ్వంసమైంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం నాయకుడు సూర్యమని ఇంటిపై వైసీపీ శ్రేణులు రాళ్లతో దాడికి పాల్పడగా ఈ దాడిని తెలుగుదేశం కార్యకర్తలు తిప్పికొట్టారు. ఈ ఘటనలో సీఐ మురళీకృష్ణ గాయపడ్డారు. ఈ దాడిపై ఫిర్యాదు చేయాడానికి వెళ్లిన తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరులపైపోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం కొత్తూరులో వైసీపీ మూకలు చేసిన దాడిలో తెలుగుదేశానికి చెందిన అనసూయమ్మ గాయపడ్డారు. ఆమెను ఆసుపత్రికి తరలించగా అక్కడా అనసూయమ్మ, ఆమె బంధువులు జ్యోతి, ఈశ్వరమ్మ చిట్టెమ్మ, శకుంతల, లలితమ్మ,అడ్డుకునే ప్రయత్నం చేసి మరొకరిపై వైసీపీ శ్రేణులు దాడిచేశాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com