CBN: వైసీపీ నేతలు ఉత్తరాంధ్ర ద్రోహులు

CBN: వైసీపీ నేతలు ఉత్తరాంధ్ర ద్రోహులు
జగన్ మానసిక స్థితి సరిగ్గా లేదన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు... కూటమి సభల్లో తీవ్ర ఆగ్రహం

జగన్ మానసిక స్థితి సరిగ్గా లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైద్యుల పరిశీలనలో ఆయన నార్సి విధానం అనే సమస్యతో ఉన్నట్లు తేలిందని చెప్పారు. ఈ విషయంలో లాడెన్ , తాలిబన్లు, కిమ్ కు ఏ మాత్రం జగన్ తీసిపోరనిఅన్నారు. వాళ్లు చెప్పిందే చేయాలని, లేకపోతే దాడి చేసి చంపేస్తారని వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లా పాణ్యం ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు జగన్ చెప్పిన అబద్ధాన్ని పదేపదే చెప్పి ప్రజలను ఇంకెంతకాలం మోసం చేస్తారని నిలదీశారు. తల్లిని, చెల్లిని తరిమేసిన జగన్ రాష్ట్రంలో ప్రజలను ఎలా చూసుకుంటారని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పి ప్రజలను ఐదేళ్లుగా మోసం చేసిన జగన్ ఇక ఇంటికి వెళ్లక తప్పదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అక్రమార్కులకు, దోపిడీ దారులకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.


వైసీపీ నేతలు ఉత్తరాంధ్ర ద్రోహులని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అనకాపల్లిలో కూటమి సభలో పాల్గొన్న ఆయన విశాఖలో భూములన్నీ దోచుకున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టుల కోసం తెలుగుదేశం ప్రభుత్వం హయాలో 2వేల 5వందల కోట్లు ఖర్చుపెడితే.... జగన్ సర్కార్ 5వందల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర సుజల-స్రవంతిని నిలిపివేశారని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కూటమి గెలుపును ఎవరూ ఆపలేరన్న చంద్రబాబు ఉద్యోగులందరూ కూటమికే ఓటు వేస్తున్నారని తెలిపారు. ల్యాండ్ టైట్లింగ్ ఆక్ట్ పై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.

జగన్‌పై మోదీ తీవ్ర విమర్శలు

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా......... ఏపీలో రాజమహేంద్రవరం, అనకాపల్లిలో జరిగిన బహిరంగసభల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సభకు.. పవన్‌, లోకేశ్‌, పురందేశ్వరి హాజరుకాగా...... గతంలో చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధిలో నెంబర్ వన్‌గా ఉండేదని, జగన్ ఐదేళ్ల హయాంలో..... పాలన పట్టాలు తప్పిందని మోదీ ధ్వజమెత్తారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే... డబుల్ ఇంజిన్ సర్కారు అవసరమని స్పష్టం చేశారు. ఏపీలో మద్యనిషేధం పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ...... తర్వాత సిండికేట్ గా తయారై వ్యాపారం చేస్తోందని మోదీ విమర్శించారు. తర్వాత అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో కూటమి సభలో... చంద్రబాబుతో కలిసి పాల్గొన్న మోదీ..... విశాఖ రైల్వే జోన్ కార్యాలయానికి వైసీపీ ప్రభుత్వం భూమి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో.... చక్కెర పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒకటేనన్న ప్రధాని ఏపీలో దేవాలయాలపై దాడులు జరిగాయని, కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయాలను రక్షిస్తామని హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story