TDP: "జగనాసుర దహనం" పేరిట నిరసన

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం మరో వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ' దేశం చేస్తోంది రావణాసుర దహనం-మనం చేద్దాం జగనాసుర దహనం అంటూ రేపు రాత్రి 7 నుంచి 7.05 నిమిషాల మధ్య మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 5 నిమిషాల పాటు ప్రజలంతా వీధుల్లోకి వచ్చి ' సైకో పోవాలి` అని రాసి ఉన్నపత్రాలను దహనం చేయాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని నినదిద్దామన్నారు. ఆ వీడియోలు, ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని కోరారు.
పండుగపూట వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. దసరాకు దేశం మొత్తం రావణాసుర దహనం చేస్తుందని చెబుతూ మనం మాత్రం జగనాసుర దహనం చేద్దామని ఏపీ ప్రజలకు సూచించారు. అక్టోబర్ 23న విజయ దశమి పర్వదినం సందర్భంగా రాత్రి 7 గంటలకు 5 నిమిషాల పాటు వీధుల్లోకి రావాలని కోరారు. ‘సైకో పోవాలి’ అని రాసి ఉన్న పత్రాలను దహనం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com