AP : ప్రజలను రక్షించే బాధ్యత మాపై ఉంది: లోకేశ్

AP : ప్రజలను రక్షించే బాధ్యత మాపై ఉంది: లోకేశ్
X

గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం నుంచి ప్రజలను రక్షించే బాధ్యత తమపై ఉందని టీడీపీ నేత లోకేశ్ స్పష్టం చేశారు. ‘గత ఐదేళ్లలో ఎన్నో హామీలు ఇచ్చాం. వాటిని అమలు చేస్తాం. యువగళం పాదయాత్ర సందర్భంగా కార్యకర్తలకు ఇచ్చిన హామీ మేరకు వారిని ఇబ్బంది పెట్టిన అధికారులు, వైసీపీ నేతలపై విచారణ కమిటీ వేస్తాం’ అని లోకేశ్ పేర్కొన్నారు.

విజయం సాధించిన కూటమి అభ్యర్థులకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అభినందనలు చెప్పారు. ‘నా సంకల్పం.. “నిజం గెలవాలి” అన్న నా ఆకాంక్ష ఫలించింది. అంతిమంగా నిజమే గెలిచింది. ఇంతటి చారిత్రాత్మక విజయం అందించిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు. అద్భుత ప్రజాదరణతో ఘన విజయం సాధించిన కూటమి అభ్యర్థులందరికీ అభినందనలు’ అని ఆమె ట్వీట్ చేశారు.

ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని, కక్షసాధింపుల సమయం కాదని కార్యకర్తలకు జనసేనాని పవన్ కళ్యాణ్ సూచించారు. ‘ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బలమైన పునాది వేసే సమయం. అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉండాల్సిన సమయం. రక్షణ లేని ఆడబిడ్డలకు రక్షణ కల్పించే సమయం. వైఎస్ జగన్ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసం పనిచేయడమే నా లక్ష్యం’ అని పవన్ స్పష్టం చేశారు.

వైఎస్ జగన్ సీఎం పదవికి చేసిన రాజీనామాను గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదించారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు జగన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండనున్నారు. ఆ తర్వాత ఆయన మాజీ సీఎం కానున్నారు.

Tags

Next Story